దేవుణ్ణి రాజకీయాలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడుకోవడం సిగ్గుచేటు..! – త్వరలోనే హుజురాబాద్ కు బై ఎలక్షన్.. ముందే జోష్యం చెప్పిన జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గణేష్ నిమజ్జనంను తన రాజకీయాలకు వాడుకోవడం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిగజారుడు తనానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్ పేర్కొన్నారు.

శుక్రవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిమజ్జనం జరిగిన తీరు బాధాకరం అని కౌశిక్ రెడ్డి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. గత తెరాస ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హుజురాబాద్ లోనీ ఎస్సారెస్పీ కాలువ వద్ద దీనికన్నా అధ్వానంగా నిర్వహించింది ప్రజలు మరిచిపోలేదని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలను అర్ధం చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని, అందుకే నీరు లేకపోయినా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారన్నారు.
హుజురాబాద్ కి ఎమ్మెల్యేవ కెసిఆర్, కేటీఆర్ కు పాలేరువ అని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి కేటీఆర్, కెసిఆర్ తో ఊరేగడం కౌశిక్ రెడ్డికి అలవాటు అయ్యింది అని అన్నారు. గణేష్ నిర్వాహకులు చందాలు అడుగుతారని హుజురాబాద్ నియోజవర్గానికి రాకుండా, నిమజ్జన ఏర్పాట్లపై దగ్గరుండి చూసుకోవలసిన కౌశిక్ రెడ్డి తప్పించుకుని తిరిగిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిమజ్జనంపై మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు. మహిళ మున్సిపల్ చైర్మన్ గతానికంటే గొప్పగా హుజురాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారనీ, ఈ విషయం పట్టణ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. భక్తినీ అడ్డు పెట్టుకొని మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు. ఎథిక్స్ కమిటీ ముందు తన సభ్యత్వం పోతుందని ముందే పసిగట్టి అసందర్భంగా ఓట్ల గురించి చిల్లర రాజకీయాలు చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. నియోజకవర్గంలో ఒక్క వినాయకున్ని అయినా దర్శనం చేసుకున్నావా..ఎందుకోసం నీ కడుపు రగులుతుంది.? అని కౌశిక్ రెడ్డిని నిలదీశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ మంత్రులు, అధికారులతో మాట్లాడి చేసిన అభివృద్ధి పనులను నేను చేసిన అని చెప్పుకొని కౌశిక్ రెడ్డి తిరుగుతున్నాడు తప్ప తన సొంతంగా ఎలాంటి అభివృద్ధి పని చేసింది లేదన్నారు. చిల్లర మాటలు మాట్లాడి రాజకీయం చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. దేవుణ్ణి అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు.. అని హితవు పలికారు. త్వరలోనే హుజురాబాద్ కు బై ఎలక్షన్ వస్తే కౌశిక్ రెడ్డికి ప్రజలే ఓటుతో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల వెంకట్, పట్టణ అధ్యక్షడు మేకల తిరుపతి, జిల్లా చేనేత సెల్ అధ్యక్షుడు బండారి సదానందం, మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, మొలుగు రాధ, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు సందీప్, మైనారిటీ నాయకులు ఎండి ఇమ్రాన్, సేవాదళ్ అధ్యక్షడు నరెడ్ల వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

