ఉన్నత విద్యపై విద్యార్థులకు అవగాహన సదస్సు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఐఐటీ ఉన్నత విద్య ప్రవేశాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కొట్టాడ రవిశంకర్ మాట్లాడుతూ…
దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటీ లలో యూజీ, పీజీ స్థాయి కోర్సుల్లో ప్రవేశం పొందడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జామ్ చక్కటి వేదిక అని అన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయి విద్యార్థులు జామ్ ప్రవేశ పరీక్షకు సరైన మార్గంలో సన్నద్ధులైనట్లయితే ఐఐటీల్లో ఉన్నత విద్య కోర్సుల్లో సులభంగా ప్రవేశం పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా జామ్ అప్లికేషన్, పరీక్ష విధానము, సిలబస్, కటాఫ్ మార్కులు ,ఐ ఐ టి ల వారీగా అందుబాటులో ఉన్న కోర్సులు, అర్హతలు మొదలగు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరాదేవి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మల్లారెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ పల్లవి ,డాక్టర్ మహిపాల్ రెడ్డి, డాక్టర్ లింగారెడ్డి, నరేందర్ ,ఓదెలు, సుమలత, రమ, స్వప్న, డాక్టర్ స్వరూపరాణి ,శ్రీధర్, రమేష్ , అఖిన్ విద్యార్థులు పాల్గొన్నారు.

