చెల్పూర్ లో వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులు..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (చెల్పూర్): తెలంగాణ తొలి భూ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో సర్పంచ్ వంతడుపుల కస్తూరి రఘు ఘన నివాళులు అర్పించారు.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ధైర్యంగా పోరాడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయిందని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, మహిళా చైతన్యానికి అందించిన స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ఐలమ్మ వంటి వీరనారుల పోరాట స్ఫూర్తి ఎంతో అవసరమని, ఆమె ఆశయాలను కొనసాగిస్తూ సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలు చిరస్మరణీయం — ఆమె పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం రజక సంఘం అధ్యక్షుడు గుడికందుల శివకృష్ణ ఆధ్వర్యంలో జరుగగా నాయకులు గుడికందుల బాబు, గూడెల్లి సదానందం, గూడెల్లి రాకేష్, నగునూరి రవీందర్, బండి శంకర్, గుడికందుల రాకేష్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పంజాల సదానందం, మండల సాయిబాబా, యూత్ మెంబర్స్ గూడెల్లి విజయ్, అజయ్, సాత్విక్, శరత్, నగేష్, వెంకటేష్, సన్నీ, బన్నీ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
## లోకల్ యాడ్స్##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ మేకల స్వరూప – తిరుపతి గారు,1వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హుజురాబాద్.

