అంగన్వాడి టీచర్ల నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సిడిపిఓ పద్మ

స్వర్ణోదయం ప్రతినిధి మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి సీడీపీవో దరోజు పద్మను కరీంనగర్ ఏసీబీ ఇన్చార్జి డిఎస్పి గొర్రె మధు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు పద్మను లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అధికారికంగా అనుకూలంగా వ్యవహరించేందుకు ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000 చొప్పున మొత్తం రూ.63,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 26న ఫిర్యాదుదారుడి నుంచి ఆమె కార్యాలయ ఆవరణ వెలుపల రూ.63,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీడీపీవో దరోజు పద్మను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. ఎవరైనా లంచం కోసం అధికారులు వేధిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు, లేదా ఏసిబి డిఎస్పీ నెంబర్ 944044 6106 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ మేకల స్వరూప – తిరుపతి గారు,1వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హుజురాబాద్.

