నేతన్నల అభివృద్ధికి కృషి. – సహాయ సంచాలకులు జి రాఘవరావు.. – ఘనంగా చేనేత సంఘం 73వ వార్షిక, 86వ మహాసభ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : చేనేత పరిశ్రమకు మూల స్తంభాలైన నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని జౌళి శాఖ జిల్లా సహాయ సంచాలకులు జి రాఘవరావు తెలిపారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి విక్రయ సంఘం 73వ వార్షికోత్సవ 86వ మహాసభ సంఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్ అధ్యక్షతన జరిగింది.




ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్న భరోసా పథకం డబ్బు పెంపునకు, గుర్తింపు కార్డుల కొరకు సంఘాల అధ్యక్షులు అందరూ కలిసి ప్రభుత్వము దృష్టికి తీసుకొని పోవాలని తెలిపారు. నేతన్నల ప్రయోజనం కోసం తాము కృషి చేస్తామని అధికారులు చేనేత కార్మికులకు వివరించారు. సంఘం అభివృద్ధి పథంలో కొనసాగాలని ఆకాంక్షించారు. సంఘం అధ్యక్షులు ఎలిగేటి ఉపేందర్ మాట్లాడుతూ సభ్యులు కోరిన నేతరణ భరోసా పథకం డబ్బు పెంచి ఇప్పించాలని నేతన్న భద్రత పథకం వలన సంఘ సభ్యుల కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేకూర్చే ఐదు లక్షల ప్రభుత్వ ఎక్స్గ్రేషియా పథకాన్ని, ఎల్ఐసి పథకాలను సదా కొనసాగించాలని కోరారు. జనరల్ నేత కూళ్లు పథకం చార్జీలు పెంచి అమలు చేయాలని, నేతపారి శ్రామికులు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేనేత గుర్తింపు కార్డులు, అంత్యోదయ, హెల్త్ కార్డులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘ సభ్యులు సిబ్బంది సమిష్టి కృషి వలన సంఘం లాభాలతో నడుస్తూ సభ్యులకు ఇన్సెంటివ్ ప్రోత్సాహక బహుమతులు ఇస్తూ.. జిల్లాలోనే అగ్రగామిగా కొనసాగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు పొందుతూ ఆదర్శ సంఘంగా పనిచేస్తున్నదని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జౌళి శాఖ అభివృద్ధి అధికారి ఎమ్మే అజార్ వహాబ్, ఆప్కో మాజీ డైరెక్టర్ ఏ సత్యనారాయణ, వివిధ సంఘాల అధ్యక్షులు డి మునిందర్, జడల పద్మ రమేష్, ఉడుత రమేష్, బి భద్రయ్య, బండారి సదానందం, వేముల యాదగిరి, తాటిపాముల తిరుపతి, సంఘం మేనేజర్ మంచికట్ల కోటిలింగం, సంఘం డైరెక్టర్లు జి మహదేవ్, ఏ సమ్మరాజు, పి తిరుపతి, ఎం కమలాకర్, కే సదానందం, కే రాజమణి, బి తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
## లోకల్ యాడ్స్ ##
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ మేకల స్వరూప – తిరుపతి గారు,1వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హుజురాబాద్.

