ఉద్యోగ JACతో జరిగిన ఒప్పందం ప్రకారం రెండు (2) DAలు మంజూరు చేస్తూ తక్షణమే GO విడుదల చేయాలి. -తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏ క్షణమైనా కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ప్రకటన రావచ్చు, అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రకటనలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక ఉద్యోగ JACతో జరిగిన ఒప్పందం ప్రకారం రెండు (2) DAలు మంజూరు చేస్తూ తక్షణమే GO విడుదల చేయాలనీ తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఒకసారి ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యాలు (DA) మంజూరు చేయజాలదనీ, గతంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం పంపిన DA మంజూరు ప్రతిపాదనలను తిరస్కరించిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంపై నెపం పెట్టి కరువు భత్యం మంజూరు ఉత్తర్వులను పక్కన పెట్టే ఆలోచనను విరమించుకోవాలన్నారు.
కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల JACతో చేసిన వాగ్దానం ప్రకారం రెండు (2) DAలు మంజూరు చేస్తూ తక్షణమే ప్రభుత్వ ఉత్తర్వులు (GO) జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నాడు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం యొక్క తదుపరి ఆమోదం (Cabinet Post-approval) తీసుకోవాలనీ ముజాహిద్ డిమాండ్ చేశారు.
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ మేకల స్వరూప – తిరుపతి గారు,1వ వార్డు కౌన్సిలర్ పురపాలక సంఘం హుజురాబాద్.. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు హుజురాబాద్.

