ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతినీ హుజురాబాద్ పద్మశాలి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని వరంగల్ రోడ్డులో గల కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు.




ఈ సందర్భంగా పద్మశాలి సంగం నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక,తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి ముద్దుబిడ్డగా జన్మించడం పద్మశాలి కుల బాంధవులందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు.సామాన్య కుటుంబంలో జన్మించి అసమాన్యునిగా ఎదిగినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ సామాన్యులకు న్యాయం చేయాలనే ఆశయంతో న్యాయవాద వృత్తిని చేపట్టి నిజాం నిరంకుశ రజాకార్ల పాలనకు వ్యతిరేక ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు న్యాయపరంగా అండగా నిలిచిన మహానుభావుడు అన్నారు. బాపూజీ తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శ పురుషుడని అభిప్రాయపడ్డారు. చేనేత సహకార రంగాలకు తగినటువంటి న్యాయము అందుట కొరకై చేనేత సహకార ఉద్యమాన్ని నడిపి చేయూతనందించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ మనందరికీ గర్వకారణమని తెలిపారు. 1969 వ సంవత్సరం తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమికను పోషించడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ కొరకు తన మంత్రి పదవిని త్యాగము చేసిన త్యాగమూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. ఆయన పద్మశాలి బిడ్డగా జన్మించడం మన అందరి అదృష్టం అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో 97వ సంవత్సరంలో కురువృద్ధుడైనప్పటికీ లెక్క చేయకుండా తెలంగాణ సహకారం కొరకు ఆమరణ దీక్ష నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ మన అందరి గుండెలలో అమరుడుగా ఎల్లప్పుడూ నిలుస్తాడని చెప్పారు. అతని ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పద్మశాలి బిడ్డలందరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు వేముల యాదగిరి,విడపు రాజు, మంద రమేష్, చందుపట్ల జనార్ధన్, చిలుకమారి శ్రీనివాస్,సబ్బని రాజేందర్,షేసంగం ఐలయ్య, సంగెం భాస్కర్, కొండా గణేష్,మండల యాదగిరి,కుడికాల సాయి, ఇప్పనపల్లి చంద్రశేఖర్, ఆడెపు సూర్యం, తౌటం శ్రీహరి, మండల కరయ్య గంజి జయవర్ధన్,సంగం భాస్కర్,సంగం శ్రీనివాస్,చిక్స్ సంఘం శ్రీనివాస్, మెడికల్ కడవెరుగు సత్,యం చారుదత్తు,గాలి సమ్మయ్య,చీకోటి వెంకటరమణ,పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

