Social 1080×1350 • Multi-page
27-09-2026 BREAKING NEWS 06:39 PM
swarnodayam.com
Telugu Daily News

జాతీయస్థాయి కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ

జాతీయస్థాయి కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థుల ప్రతిభ
IMG-20260927-WA0069

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హనుమకొండ జిల్లా బట్టుపల్లి వద్ద ఇటీవల జరిగిన నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ కియా జపాన్ ఫోటో కం కరాటే అసిస్టెంట్ ఇండియా ఆధ్వర్యంలో హుజురాబాద్ జిఎస్ కే డి ఐ కరాటే అకాడమీ విద్యార్థులు పథకాలు సాధించారని కరాటే మాస్టర్ ఎస్కే జలీల్ తెలిపారు.

ఈ పోటీలలో ఎస్కే. సదుల్లా బాబా స్పారింగ్ లో గోల్డ్ మెడల్, భాను తేజ కటాస్ లో గోల్డ్ మెడల్, సాయి చరణ్ స్పారింగ్ లో గోల్డ్ మెడల్, కటాస్ లో సిల్వర్ మెడల్ హుమేరా తస్లీమ్ కటాస్ లో గోల్డ్ మెడల్, వినూత్న కటాస్ లో గోల్డ్ మెడల్, సాక్షిత్ కటాస్ లో గోల్డ్ మెడల్, హేమ కటాస్ లో గోల్డ్ మెడల్ , సాయి కటాస్ లో గోల్డ్ మెడల్, ఎస్.కె గౌసియా కటాస్ లో గోల్డ్ మెడల్ సాధించిందని ఆయన తెలిపారు. కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన హుజురాబాద్ పిల్లలను తెలంగాణ రిటైర్డ్ ఆల్ పెన్షనర్స్ సంగం జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, రిటైర్డ్ పిడి కొన్ని రాజిరెడ్డి,17వ వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, జ్యోతిరావు పూలే జయంతోత్సవ కమిటీ మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ బి రాజ్ కుమార్, ప్రిన్సిపల్ వెంగళ రావు, డైరెక్టర్ వి గోపాల్, కరాటే మాస్టర్ తదితరులు అభినందించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!