4న హైదరాబాదులో జరిగే ”మాల ల సభను విజయవంతం చేయాలి.. – మాల స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు పిలుపు

,మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని, రోస్టర్ సవరణ కోసం అక్టోబర్ 4న హైదరాబాదులో “మాల విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్థుల సభ”ను విజయవంతం చేయాలని మాల స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు అన్నారు.

శనివారం రాత్రి హుజురాబాద్ కు చేరుకున్న మాల విద్యార్థుల జేఏసీ కి హుజురాబాద్ మాల సంఘం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా మాలల సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మాలలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పర్యటిస్తున్నామని తెలిపారు. మాల సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై ప్రతి ఒక్కరూ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రోస్టర్ సవరణ సాధనే లక్ష్యంగా అక్టోబర్ 4న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకులు పాక సతీష్, రాష్ట్ర కార్యదర్శి పసుల స్వామి, కౌన్సిలర్ సొల్లు సునీత, నాయకులు సొల్లు బాబు, సందమల్ల బాబు, యేముల పుష్పలత, పోతుల సంజీవ్, యాదగిరి, బెల్లి వెంకటస్వామి, పిట్ట శ్రీనివాస్, నర్సింగం తదితరులు పాల్గొన్నారు.

