కూచిపూడి నృత్యరంగంలో విశేష ప్రతిభ కనబరిచిన గుజ్జ పల్లవి రెడ్డికి “టాలెంట్ ఐకాన్ అవార్డు ”

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం, చెల్పూర్ గ్రామానికి చెందిన గుజ్జ పల్లవి రెడ్డి (W/o నవీన్ రెడ్డి) కూచిపూడి నృత్యరంగంలో గత 10 సంవత్సరాలుగా విశేష ప్రతిభను కనబరుస్తూ, కళాకారిణిగా మరియు నృత్య ఉపాధ్యాయురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
పల్లవి రెడ్డి ఇప్పటికే రెండుసార్లు గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించడంతో పాటు, కూచిపూడి నృత్యంలో నంది అవార్డును కూడా అందుకున్నారు. అంతేకాకుండా ఆల్ ఇండియా స్థాయి కూచిపూడి పోటీల్లో 3వ స్థానం సాధించారు. అలాగే “నాట్య మయూరి అవార్డు”ను కూడా అందుకున్నారు.
విద్యాపరంగా B.Tech పూర్తి చేసిన పల్లవిరెడ్డి, కూచిపూడి నృత్యంలో కూడా అకాడమిక్ విద్యను పూర్తి చేశారు. అనంతరం స్వయంగా “హయగ్రీవ నాట్య అకాడమీ”ను స్థాపించి, నృత్యంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు.
ముఖ్యంగా 30 మంది అనాథ పిల్లలకు ఉచితంగా కూచిపూడి నృత్యాన్ని బోధిస్తూ, కళతో పాటు సేవాభావాన్ని కూడా చాటుకుంటున్నారు. స్వయంగా అకాడమీని నిర్వహిస్తూ, అనేక మంది విద్యార్థులకు కూచిపూడి కళలో శిక్షణ అందిస్తున్నారు.

పల్లవిరెడ్డి ప్రతిభ, కళాసేవ, విద్యార్థులకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ “Best Classical Dancer – Talent Icon Award”కు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో పల్లవిరెడ్డి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి, కూచిపూడి కళకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆమె తల్లిదండ్రుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు.
అమ్మా, నాన్నల దీవెనలతో నీ ప్రయాణం మరింత విజయవంతం కావాలనీ, మరెన్నో అవార్డులు, మరెన్నో శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.

