బిజెవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ… అన్ని దానాల్లో కన్నా రక్త దానం మహాదానమనీ, సమాజ సేవలో యువత ఎప్పుడూ ముందుండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి , బీజేవైఎం ఉపాధ్యక్షులు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి, కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నరేష్, పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, మండల అధ్యక్షులు పారుపల్లి కొండల్ రెడ్డి, నాయకులు గంగిశెట్టి రాజు, గంగిశెట్టి ప్రభాకర్, రావుల వేణు, కన్వీనర్ నరెడ్ల చైతన్యరెడ్డి, కౌన్సిలర్లు దామెర అనూష, కొలుగురి సుమలత, పంజాల మనోజ్, కొండ ప్రశాంతి, తిప్పబత్తిని రాజు, ,రాకేష్, ప్రణీత్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

