విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. – డాక్టర్ ప్రభుదాస్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : విద్యనభ్యసించే విద్యార్థులు మొదట చదువుకే ప్రాధాన్యత ఇవ్వాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హుజురాబాద్ డిప్యూటీ డిఎం, హెచ్ ఓ డాక్టర్ ప్రభుదాస్ అన్నారు. సోమవారం హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయని అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాల అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ…. మత్తు పదార్థాలకు బానిసవుతే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కే సుగుణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం,
డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ పి ప్రసాద్, స్టూడెంట్ కౌన్సిలర్ రాజేశం, ప్రసాద్, విజయేందర్ రెడ్డి, మురళీమోహన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

