Social 1080×1350 • Multi-page
29-09-2026 BREAKING NEWS 02:11 PM
swarnodayam.com
Telugu Daily News

ఇచ్చిన హామీలను అమలుపర్చాలి.. సీఎం రేవంత్ కు ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు బహిరంగ లేఖ.

ఇచ్చిన హామీలను అమలుపర్చాలి.. సీఎం రేవంత్ కు ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు బహిరంగ లేఖ.
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: విద్యార్థులు, రైతులు, వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి ఎన్నికల మేనిఫెస్టోలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ హామీల అమలులో నిర్లక్ష్యం చేయడం తగదని ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి 33 నెలలు పూర్తి చేసుకొని కరీంనగర్ పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఇదే జిల్లాకు చెందిన ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆయనకు ప్రజా సంఘాల తరపున బహిరంగ లేఖ రాశారు.
ఈ మేరకు మంగళవారం కరీంనగర్ లో లేఖ ప్రతులను పాత్రికేయులకు పోలాడి రామారావు అందజేశారు.

విద్యార్థులకు ఉద్యోగాల కల్పనలో, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదలలో, స్కాలర్ షిప్ స్టయిఫాండ్ ఇవ్వడం లోప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందనిఆరోపించారు.
నిరోద్యోగ భృతి ఊసే లేదన్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట 105 ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం తగదన్నారు.
ప్రభత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని రామారావు డిమాండ్ చేశారు.
రైతులకు ఏడాదికి ఎకరానికి 15 వేలు రైతు బంధు ఇస్తామన్నా హామీ అమలుకు నోచుకోలేదని, రుణమాఫీ పథకంలో మిగిలిపోయిన అర్హులైన 30 శాతం మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. రైతు భీమా అమలు చేయడం లేదన్నారు. అన్ని రకాల దాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్న హామీలో కేవలం సన్న రకాలకే పరిమితం చేశారన్నారు. గత పంట కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యం చేయడంతో ప్రైవేట్ దళారులు ప్రవేశించి రైతులను నిలువు దోపిడీకి గురించేశారని వచ్చే పంట కొనుగోళ్లలో పునరావృతం కాకుండా దాన్యాన్ని సకాలంలో ప్రభుత్వమే నేరుగా మద్దతు ధరతో కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చెశారు.
వ్యవసాయ పని ముట్లను సబ్సిడీ తో రైతులకు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పిల్లర్లను తక్షణమే మరమ్మత్తు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్ ఆర్ ఎస్ పి ద్వారా నీళ్లు విడుదల చేసి చెరువు కుంటలను నింపాలని డిమాండ్ చేశారు.
వివిధ ఓసీ సామాజిక వర్గాల పేదల సంక్షేమానికి ప్రతేక కార్పొరేషన్ లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం పూర్తి స్థాయి పాలక మండల్లు ఏర్పాటు చేయలేదని నిధులు కేటాయించలేదన్నారు.
రెడ్డి కార్పొరేషన్ కు అసలు పాలక మండలి నేటికీ ఏర్పాటు చేయలేదని మండి పడ్డారు.
ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విదేశీ విద్య కు అందించే ఓవర్సీస్ పథకంలో అవకాశం కల్పించడం లేదన్నారు. వివిధ రెసిడెంషియల్ కాలేజీల్లో, పాఠశాలల్లో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అధికార్లు అమలు చేయడం లేదన్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు మిగతా వారి వలె జిల్లా కొకటి రెసిడెన్షియల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్ కు కేటాయించిన ఉద్యోగాలల్లో భర్తీ కాని మిగిలిన ఈడబ్ల్యూఎస్ కోటా బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులతోనే తరిగి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విభాగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లను పటిష్టంగా అమలు చేయడానికి ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
కరీంనగర్ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడాలని మానేరు నదికి ఇరువైపుల నిర్మిస్తున్న నిలిచిపోయిన రివర్ ఫ్రంట్ పనులను యధా తతంగా వేగవంతం చేయాలన్నారు. గతంలో పర్యాటకులను విపరీతంగా ఆకర్శించిన తీగల బ్రిడ్జి వంతెన పరిసర ప్రాంతం నేడు ఆసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనన్నారు. తీగల వంతెన పైకనీసం లైట్లు కూడా వెలిగించడం లేదన్నారు. ఎల్ ఎండి ప్రాజెక్ట్ సమీపాన ఉన్న ఐటీ టవర్స్ లో
కంపనీలు లేక బోసిపోతున్న ఐటీ టవర్స్ ను పాలకులు పట్టించుకోక పోవడంతో నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.
కరీంనగర్ మున్సిపల్ లో విలీనం అయిన శివారు ప్రాంతాల మౌలిక సౌకర్యాల అభివృద్ధి నోచుకోవడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు మరమ్మతులకు నోచుకొక అద్వాన్నంగా ఉన్నాయన్నారు.
రాష్ట్రం లో విచ్చలవిడిగా వెలిసిన మద్యం బెల్ట్ షాప్ లను కట్టడి చేసి బార్ అండ్ రెస్టారెంట్ లను, మద్యం షాప్ లను ఇష్టానుసారంగా పెంచకుంగా చూడాలన్నారు. బతుకమ్మ చీరలను నేతన్న ల వద్దే కొనుగోలు చేసి సకాలంలో మహిళలకు అందించాలన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో , ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ కు రాసిన లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్లు పోలాడి రామారావు తెలిపారు.
లేఖపై సంతకం చేసిన వారిలోఓసీ జేఏసీ జాతీయ చైర్మన్ నల్లా సంజీవరెడ్డి, జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపథి, ఉపాధ్యక్షులు చెన్నామనేని పురుషోత్తమరావు, చందుపట్ల నర్సింహారెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, బుస్సా శ్రీనివాస్, కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వర్ రావు, ప్రచార కార్యదర్శులు గూడూరు స్వామిరెడ్డి, కామిడి సతీష్ రెడ్డి కార్యదర్శి ఎడవెళ్లి కొండాల్ రెడ్డి, ఉమ్మడి జిల్లా నాయకులు ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, జున్నుతుల రాజిరెడ్డి, ఐలినేని మల్లికార్జునరెడ్డి, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి,తాటిపల్లి రాజన్న, కంకణాల సరోజన, ప్రభావతి రెడ్డి, చీటీ శిరీష ఏనుగు చొక్కారెడ్డి, ఎన్నం కిషన్ రెడ్డి, డాక్టర్ దీపక్ బాబు, కొత్త కొండ రవీందర్ రావు, జనగామ కరుణాకర్ రావు, నల్ల కొండాల్ రెడ్డి, వంగళ తిరుపతిరెడ్డి, మహంకాళి రాజన్న, బండ సంపత్ రెడ్డి, జంపాల నర్సయ్య, సుద్దాల రాజయ్య, చింతిరెడ్డి రమణారెడ్డి తదితరులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!