Social 1080×1350 • Multi-page
29-09-2026 BREAKING NEWS 07:31 PM
swarnodayam.com
Telugu Daily News

మైనారిటీల సంక్షేమ, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. – కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు

మైనారిటీల సంక్షేమ, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. – కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు
IMG-20260929-WA0087

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఏళ్ళుగా ఎదురుచూస్తున్న పనులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మోక్షం కలిగిస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని 13వ వార్డులో గల షాధిఖాన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుటుందని, ప్రత్యేక నిధుల ద్వారా శాధిఖాన ప్రహరీ కోసం 17 లక్షలు కేటాయించడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వానాకాలం సంబంధించి పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, కౌన్సిలర్లు పుణ్య, ఖలీద్ హుస్సేన్, సునీత, కో ఆప్షన్ సభ్యులు, ఈద్గా, మసీద్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల, అధ్యక్షులు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!