హుజురాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.. – దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావు. -హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హిందూ దేవుళ్ళ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం హుజురాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దేవుళ్లను, ప్రాంతాలను విభజిస్తూ మాట్లాడటం సీఎం స్థాయికి తగదనీ వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని అన్నారు.
శ్రీరాముడు ధనికుల దేవుడు, శివుడు పేదల దేవుడు” అంటూ దేవుళ్లను కూడా పేద–ధనిక వర్గాలుగా విభజిస్తూ సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. అలాగే ఉత్తర భారతీయులు ఆర్యులు, దక్షిణ భారతీయులు ద్రావిడులు అన్న విధంగా ప్రాంతీయ విభజనను ప్రస్తావించడం సమాజంలో అనవసరమైన విభేదాలకు దారితీసేలా ఉందని పేర్కొన్నారు.
రాముడు, శివుడు కోట్లాది మంది భారతీయుల ఆరాధ్య దైవాలని, భక్తికి పేద–ధనిక, ఉత్తర–దక్షిణ అనే తేడాలు ఉండవని స్పష్టం చేశారు.
తెలంగాణలో వేములవాడ వంటి పుణ్యక్షేత్రంలో ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ శివుడిని దర్శించుకున్నారన్నారు. హిందూ దేవుళ్ళ పైన ఈ దేశ ప్రధాని మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు.
ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించాల్సిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దేవుళ్ల పేరుతో, ప్రాంతాల పేరుతో విభజనకు దారితీసే వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన నాయకత్వానికి తగదని అన్నారు.
రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకోవడం కాదు…
దేవుళ్లను గౌరవించడం నేర్చుకోవాలన్నారు .
ఉత్తరం దక్షిణం కాదు… భారతదేశం ఒక్కటే.
ఆర్య–ద్రావిడ విభజనలు కాదు… భారతీయతే మన ఐక్యత. పేద–ధనిక భేదాలు కాదు… భక్తి అందరిదీ. ప్రజలను విడదీసే రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజల సమస్యలు, అభివృద్ధి, సంక్షేమం, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి తిప్పబత్తిని రాజు, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, అంకటి వాసు, యంసాని శశిధర్, పట్టణ ఉపాధ్యక్షులు యల్ల సంజీవరెడ్డి, ఓడ్నాల విజయ్, పట్టణ కార్యదర్శులు గుర్రం సంతోష్, కొడిమ్యాల పవన్ కుమార్, బొడిగె రాధా, పట్టణ కోశాధికారి క్యాష వెంకటేష్, గంధం అనిల్, తూర్పాటి రామచంద్రపురం, పురాణం కృష్ణయ్య, తూర్పాటి సురేష్, నీలం రవీందర్, పురాణం రాజు, పర్ధం విజయ్ తదితరులు పాల్గొన్నారు.

