Telugu Daily News
విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మంగళవారం నశాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వాటికి దూరంగా ఎలా ఉండాలో వివరించారు. ఈ సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కే సుగుణ, హుజురాబాద్ మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, ఎక్సైజ్ ఎస్సై పి సురేష్, జండర్ స్పెషలిస్టు ఈ శైలజ, అధ్యాపకులు ప్రసాద్, తులసి దాస్, వాసుదేవరావు, విజేందర్ రెడ్డి, మురళీమోహన్, వనమాల తదితరులు పాల్గొన్నారు.

