Social 1080×1350 • Multi-page
29-09-2026 BREAKING NEWS 09:42 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

హుజురాబాద్‌లో ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
IMG-20260929-WA0116

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టణంలోని పలు ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి (DAO) ఛత్రు నాయక్, మండల వ్యవసాయ అధికారి (AO) భూమిరెడ్డి మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

​ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్ మాట్లాడుతూ… డీలర్లు ప్రభుత్వం ధ్రువీకరించిన ఎరువులు, పురుగుమందులను మాత్రమే నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

​ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరి పంటలో కాండం తొలుచు పురుగు, వరి నల్లి, సుడిదోమ ఆశించే అవకాశం ఉందని, వాటి నివారణకు వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మందులనే తగిన మోతాదులో, సరైన జాగ్రత్తలతో పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. రైతులు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన ప్రామాణిక దుకాణాల్లోనే పురుగుమందులు కొనుగోలు చేయాలని కోరారు.

​ఈ తనిఖీ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భూమిరెడ్డితో పాటు స్థానిక ఎరువుల, పురుగుమందుల డీలర్లు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!