Social 1080×1350 • Multi-page
29-09-2026 BREAKING NEWS 11:43 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో వైభవంగా గ్యార్మి షరీఫ్ ఉత్సవాలు – పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్‌లో వైభవంగా గ్యార్మి షరీఫ్ ఉత్సవాలు – పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20260929-WA0142

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో గ్యార్మి షరీఫ్ ఉత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…మతసామరస్యానికి గ్యార్మి షరీఫ్ ఉత్సవాలు ప్రతీక అని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మైనార్టీ సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా ఆయన పండగ శుభాకాంక్షలు తెలిపారు.
​ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ​బండ శ్రీనివాస్ (మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్), దిలీప్ (జమ్మికుంట మున్సిపల్ చైర్మన్), జావీద్ (జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్), సమ్రీన్ ​ఘఫర్ (కౌన్సిలర్), ఇమ్రాన్ (మాజీ కౌన్సిలర్), ​మల్లరెడ్డి (సర్పంచ్), ​తిరుపతి రెడ్డి (మాజీ ఎంపీపీ), ​అజ్జాద్ ఖాన్ ​మరియు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు, సోదరీమణులు, స్థానిక ప్రజలు హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!