గ్రామీణ అభివృద్ధి దేశ అభివృద్ధి కి పునాది.. -కిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే శంకర్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి దేశ అభివృద్ధికి పునాది వంటిదని కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే .శంకర్ అన్నారు. కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సింగాపురం లో కళాశాల సెక్రటరీ మరియు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వి. సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకల సమావేశములో డాక్టర్ శంకర్ ముఖ్య వక్తగా మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందించే ఉద్దేశంతో ఈ కళాశాలను యాజమాన్యం వారు స్థాపించారని అన్నారు. కళాశాల రిజిస్టర్ డాక్టర్ వి. రాజేశ్వరరావు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ విద్యార్థుల ఎదుగుదలకు కృషి చేస్తూ ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా అధ్యాపకులు డాక్టర్ వేణుగోపాల్, యాకూబ్, ఆఫీస్ సూపరింటెంట్ పెంచాల శ్రీనివాస్ లు వ్యవహరించారు. వివిధ విభాగాల అధిపతులు ,ఇన్చార్జులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

