Telugu Daily News
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత.. – 77 ఏళ్ల వయసులో తుదిశ్వాస..- చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ (77) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన గత పది రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ట్రస్టు ప్రతినిధి ప్రకటించారు.
ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందిన విజయకుమార్ నాయుడు భక్తులకు ఆధ్యాత్మిక సాధన, మానవతా విలువలు, సేవాభావంపై బోధనలు చేశారు. ఆయన మృతితో భక్తులు, అనుచరుల్లో విషాదం నెలకొంది.
ఆయన పార్థివదేహాన్ని తిరుపతిలోని ఏకం క్షేత్రంలో భక్తుల సందర్శనార్థం ఉంచనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

