మహాజన సోషలిస్టు పార్టీ మండల మహిళ అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక

-చిలుమల మనోహర ఉపాధ్యక్షురాలుగా మైస రజిత గుల్లి విమల
-జాతీయ నాయకులు రుద్రా వరపు రామచంద్రం మాదిగ
-కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ
-మహాజన సోషలిస్టు పార్టీ మహిళా విభాగం కన్వీనర్ బొద్దుల వాణి మాదిగ
-మండల ఇన్చార్జి తునికి వసంత్ మాదిగ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) సెప్టెంబర్ 30: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం లో మహాజన సోషలిస్టు పార్టీ మహిళ మండల కమిటీని వేశారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా తునికి వసంత మాదిగ, మండల ఇన్చార్జి తునికి వసంత్ మహాజన సోషలిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అధ్యక్షత వహించగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మండల అధ్యక్షురాలుగా చిలుమల మనోహర, ఉపాధ్యక్షురాలుగా మైస రజిత, గుల్లి విమల, సభ్యుల అభిప్రాయాల సూచనలు సలహాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కమిటీకి సభ్యులుగా అల్లూరి మౌనిక, గుల్లి తిరుమల, గుల్లి ప్రియాంక, మైసా చిలకమ్మ, రాగుల ఓదమ్మ, గాజుల లక్ష్మి, బుర్ర రాజేశ్వరి ఎన్నికయ్యారన్నారు. ఈ మహాజన సోషలిస్టు పార్టీ మహిళా మండల ఎన్నికకు జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం మాదిగ, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజుమాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ తునికి వసంత్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. మహాజన సోషలిస్టు పార్టీ మహిళా విభాగం కన్వీనర్ బొద్దుల వాణి, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ బొద్దుల దివ్య హాజరయ్యారు. మహాజన సోషలిస్టు పార్టీ నియమ నిబంధనల గురించి రాబోయే రోజులలో హక్కుల సాధన ఆత్మగౌరవం సమానత్వం గురించి పోరాడవలసి ఉంటుందని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం మండల కమిటీలు, జిల్లా కమిటీలు, గ్రామస్థాయి కమిటీలను వేయడం జరుగుతుందన్నారు. కమిటీలు వేయుటకు సలహాలు సూచనలు మంద రాజు యొక్క సలహా సూచన మేరకు పనిచేయుచున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాది నాయకత్వం వర్ధిల్లాలి, వారి నాయకత్వంలో పనిచేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము అని పేర్కొన్నారు. మహిళల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపి ముందుకు నడిపిస్తున్న వారికి మేము రుణపడి ఉంటామన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉన్నటువంటి మా మహిళ నాయకురాళ్ల సలహాలు సూచనలు వారి ఆదేశానుసారము కూడా పని చేస్తున్నామని సభ్యులందరికీ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 02 అక్టోబర్ 2026 న జరగబోయే కరీంనగర్ జిల్లాలో ధర్నా మద్యపాన నిషేధంపై అందరం కలిసికట్టుగా ముందుకు సాగి ఇట్టి మద్యపాన నిషేధ ధర్నాను విజయవంతం చేయాలని అందరికీ పులుపునిచ్చారు.

