Telugu Daily News
హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని సీఎంకి ఘన సన్మానం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (కరీంనగర్ ) : కరీంనగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయాల (ఐడీఓసీ) ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులకు హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు హాజరైన మంత్రులను ఆమె శాలువాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి దిశగా ఈ నూతన సమీకృత కార్యాలయాల సముదాయం ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

