Social 1080×1350 • Multi-page
30-09-2026 BREAKING NEWS 11:57 PM
swarnodayam.com
Telugu Daily News

సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర : పోటెత్తిన అశేష జనసందోహం

సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర : పోటెత్తిన అశేష జనసందోహం
IMG-20260930-WA0150

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధ(కరీంనగర్) సిరిసిల్ల: ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాదయాత్ర అశేష జనసందోహం నడుమ అత్యంత వైభవంగా సాగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుండి రగుడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వరకు దాదాపు 3 కిలోమీటర్లకు పైగా సీఎం ఈ పాదయాత్ర నిర్వహించారు.

​పట్టణ నడి వీధుల గుండా సాగిన ఈ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి వీధుల ఇరువైపులా నిలబడిన ప్రజలకు, చేనేత కార్మికులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలిరావడంతో సిరిసిల్ల వీధులు కిటకిటలాడాయి.

​ఈ పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ టిపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు భాగస్వాములయ్యారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!