Social 1080×1350 • Multi-page
01-10-2026 BREAKING NEWS 12:11 AM
swarnodayam.com
Telugu Daily News

సిరిసిల్ల అభివృద్ధికి రూ. 340 కోట్లు : శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

సిరిసిల్ల అభివృద్ధికి రూ. 340 కోట్లు : శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Oplus_16908288

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్
(​సిరిసిల్ల ):
రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రూ. 340 కోట్ల వ్యయంతో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సిరిసిల్ల నేతన్నల చిరకాల స్వప్నమైన ‘నేతన్న బజార్’ నిర్మాణంతో పాటు విద్య, పాలన, రక్షణ, మహిళా సాధికారత రంగాలు లక్ష్యంగా ఈ భారీ నిధులను కేటాయించారు.
​అభివృద్ధి పనుల ప్రధాన వివరాలు:
​విద్యారంగానికి బూస్ట్:

​సిరిసిల్ల, వేములవాడలలో రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు’ సీఎం శంకుస్థాపన చేశారు.
​సిరిసిల్ల, కోనరావుపేటలలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల’ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
​నేతన్నలకు అండ – నేతన్న బజార్:
​స్థానిక చేనేత, పవర్‌లూమ్ కార్మికుల ఉత్పత్తుల మార్కెటింగ్, విక్రయాల కోసం ప్రతిష్టాత్మక ‘నేతన్న బజార్’ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
​రాజన్న ఆలయ అభివృద్ధి:
​వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ సమగ్ర అభివృద్ధిలో భాగంగా రూ. 99.40 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
​మౌలిక సదుపాయాలు & ప్రభుత్వ భవనాలు:
​పాలనా సౌలభ్యం కోసం సిరిసిల్ల, వేములవాడలలో రెండు ఆర్‌డీఓ (RDO) కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణాలకు పునాది రాయి వేశారు.
​వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కోసం రుద్రంగిలో 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
​ప్రజా రక్షణ – పోలీస్ స్టేషన్లు:
​వేములవాడలో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్‌‌తో పాటు, శాంతిభద్రతల పరిరక్షణకు వేములవాడ, సిరిసిల్లలలో రెండు నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
​మహిళా సాధికారత:
​సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో మోడల్‌గా నిర్మించిన ‘ఇందిరా మహిళా శక్తి భవన్’ను సీఎం జాతికి అంకితం చేస్తూ ప్రారంభించారు.
​సిరిసిల్ల నేతన్నల సంక్షేమం, మహిళల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పనులను వేగవంతంగా పూర్తి చేస్తుందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు
.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!