Social 1080×1350 • Multi-page
01-10-2026 BREAKING NEWS 04:22 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్లకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. – ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు.

ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్లకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. – ఓసీ ఐకాస జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు.
Oplus_16908288

— రేపు ఢిల్లీకి ఓసీ ఐకాస రాష్ట్రాల ప్రతినిధులు.
ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల అమలుకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు
..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : మహాత్మాగాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2న రేపు ఢిల్లీలోని రాజ్ ఘాట్ నుంచి సామాజిక ఉద్యమ కారుడు ప్రవీణ్ ఆరోరా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల బస్సు యాత్రలో ఓసీ జేఏసీ ప్రతినిధులు పాల్గొంటారని ఓసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ఈమేరకు గురువారం నగరంలో నిర్వహించిన ఓసీ ఐకాస జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రతినిధుల సమావేశంలో ఓసీ జేఏసీ జాతీయ చైర్మన్ నల్లా సంజీవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి తో కలిసి పోలాడి రామారావు మాట్లాడారు.
అక్టోబర్ 2న రేపు ఢిల్లీలో ప్రారంభించనున్న
ఈ బస్సు యాత్ర తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించేందుకు ఓసీ ఐకాస తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రామారావు కోరారు.
అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుక బడిన పేద వర్గాలకు ఆర్ధిక ప్రాతి పదికన రిజర్వేషన్ల అమలుకు పోరాట అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి సమన్వయంతో పని చేయాలని ప్రతినిధులకు కోరారు.
అన్ని ఓసీ సంఘాలు, తమ ఓసీ జేఏసీ ఆధ్వర్యంలోరాజకీయాల కతీతంగా రాష్ట్ర, దేశవ్యాప్తంగా చేసిన ఎన్నో ఏళ్ల సంఘటిత, అలపెరుగని అనేక పోరాటాల ఫలితంగా ఓసీల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కల్పించిందన్నారు. తాము ఏ ఇతర సామాజిక వర్గీయులకు గాని, ఏ మతానికి గాని వ్యతిరేకం కాదని పేదలందరికి అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ లక్ష్యం అని పోలాడి రామారావు అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 80 సంవత్సరాలు గడుస్తున్నా పేదలు పేదలు గానే ఉంటున్నారని, ధన వంతులు మరింత ధన వంతులు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సామాజిక సమతూకం దెబ్బతిని యువతరం లో అసంతృప్త జ్వాలాలు ఎగిసి పడుతున్నాయన్నారు.
ఈ నేపథ్యంలో సమాజంలో అన్ని వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి సంక్షేమ రంగాల్లో సమన్యాయం జరుగుటకు ప్రస్తుతం అమలవుతున్న కుల, మత ప్రాతి పదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ లు కల్పించాలన్నదే తమ ఓసీ జేఏసీ ద్యేయం అని ఇదే మా మూల సిద్దాంతం అని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.
ఇందుకు రాజ్యాంగ సవరణ జరుపుటకు పార్లమెంట్ లో చర్చించి ప్రత్యేక చట్టం రూపొం దించడానికీ కేంద్ర ప్రభుత్వం చట్ట బద్దత గల ప్రత్యేక రాజ్యాంగ కమిషన్ వేసి అన్ని వర్గాల ఆర్ధిక స్థితి గతులను అధ్యయనం చేయాలని దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని పోలాడి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ లలో క్రిమీలేయర్ విధానం అమలు లేక పోవడంతో అట్టడుగు వర్గాల పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రామారావు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో ఏపీ ఓసీ జేఏసీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు, వివిధ రాష్ట్ర, జిల్లాల ఓసీ ఐకాస ప్రతినిధులు చెన్నమనేని పురుషోత్తంరావు, చందుపట్ల నర్సింహారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తాటిపల్లి రాజన్న, కొత్తకొండ రవీందర్ రావు, రత్నాకరశర్మ, బుస్సా శ్రీనివాస్, వీసం సురేందర్ రెడ్డి, చకిలం రాజేశ్వర్ రావు, అంచూరి సధానందం, బైరెడ్డి రాంరెడ్డి, నల్లా రాజిరెడ్డి, పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కొలగూరి రాజేశ్వర్ రావు, బొమ్మదేవర వెంకటేశ్వర్ రావు, నడిపెల్లి వెంకటేశ్వర్ రావు, చింతిరెడ్డి రమణారెడ్డి, కర్క అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!