Social 1080×1350 • Multi-page
01-10-2026 BREAKING NEWS 08:24 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో వైభవంగా బొడ్డెమ్మ వేడుకల ప్రారంభం

హుజురాబాద్‌లో వైభవంగా బొడ్డెమ్మ వేడుకల ప్రారంభం
IMG_20261001_202021

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో సంప్రదాయ బొడ్డెమ్మ వేడుకలు గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భాద్రపద మాసంలో తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా స్థానిక మహిళలు భక్తిశ్రద్ధలతో భాగస్వాములయ్యారు.

​పుట్టమట్టితో విశేషంగా బొడ్డెమ్మను తయారు చేసి, పీటపై నిలిపి రంగురంగుల పూలతో అలంకరించారు. అనంతరం సాయంత్రం వేళ మహిళలు, యువతులు ఒకచోట చేరి బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లతో, జానపద పాటలతో ఉత్సాహభరిత వాతావరణంలో ఆటపాటలు నిర్వహించారు.

​ఏటా భాద్రపద మాసంలో పలుచోట్ల నిర్వహించే ఈ పూర్వకాలపు సంప్రదాయ వేడుకల్లో పట్టణ మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

హుజురాబాద్ లోని కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద బొడ్డెమ్మ ఆడుతున్న మహిళలు..

హుజురాబాద్‌లోనీ కుమ్మరివాడలో వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు జరుపుకుంటున్న మహిళలు..

సిర్సపల్లి లో బొడ్డెమ్మ వేడుకలు ఆడుతున్న మహిళలు, యువతులు, చిన్నారులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!