హుజురాబాద్ సబ్ జైల్లో వైభవంగా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, డిసెంబర్ 02 : హుజురాబాద్ సబ్ జైలు ఆవరణలో మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని జయంతి వేడుకలతో పాటు ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి కె. కిరణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, ఖైదీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నేరం పట్ల పశ్చాత్తాపం చెంది, జైలు జీవితం తర్వాత మంచి పౌరులుగా సమాజంలో జీవించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఖైదీల కోసం నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు న్యాయమూర్తి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో సబ్ జైల్ ఇన్‌చార్జ్, అసిస్టెంట్ డిప్యూటీ జైలర్ తాళ్లపల్లి సురేష్ తో పాటు కవి, రచయిత డాక్టర్ నాగుల సత్యం గౌడ్, జైలు సిబ్బంది, ఇతర ముఖ్యులు పాల్గొన్నారు.
&& లోకల్ యాడ్స్ &&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తూర్పాటి లక్ష్మీ దుర్గ – రాజు గారు, 23వ వార్డు కౌన్సిలర్, బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు.

