రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన హుజురాబాద్ ఏసీపీ మాధవికి ఘన సన్మానం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) :
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి 5 పతకాలు సాధించిన హుజూరాబాద్ ACP వాసంశెట్టి మాధవిని జమ్మికుంట పట్టణ సీఐ సుధగోని రామకృష్ణ గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.
ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ACP మాధవి టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పాల్గొని 4 స్వర్ణ (గోల్డ్), 1 రజత (సిల్వర్) పతకాలతో విక్టరీ కొట్టారు. శాఖాపరమైన బాధ్యతలతో బిజీగా ఉంటూనే క్రీడల్లోనూ ప్రతిభ చాటి 5 మెడల్స్ సాధించడం పట్ల జమ్మికుంట పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ACP కార్యాలయంలో ఆమెకు పూలమాలలు వేసి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సీఐ సుధగోని రామకృష్ణగౌడ్ తో పాటు స్థానిక ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తూర్పాటి లక్ష్మీ దుర్గ – రాజు గారు, 23వ వార్డు కౌన్సిలర్, బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు.

