శాలపల్లి -ఇందిరానగర్ గ్రామస్థుల రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్ !

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆర్టీసీ బస్సులు నిలపడం లేదంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి ఇందిరానగర్ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట హుజురాబాద్–జమ్మికుంట ప్రధాన రహదారిపై గ్రామ పాలకవర్గంతో కలిసి ప్రజలు బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు.
రోజూ వందలాది ఆర్టీసీ బస్సులు ఈ మార్గంలో వెళ్తున్నప్పటికీ, తమ గ్రామంలో బస్ స్టాప్ ఉన్నా ఆపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోయారు. ముఖ్యంగా నిత్యం విద్యాలయాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, దినసరి కూలీలు గమ్యస్థానాలకు చేరలేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు హుజురాబాద్ డిపో మేనేజర్‌కు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు.
”వీ వాంట్ జస్టిస్” అంటూ విద్యార్థులు, మహిళలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపైనే బైఠాయించడంతో ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో అన్ని ఆర్టీసీ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కే ప్రవీణ్, ఉప సర్పంచ్ కే అశోక్ ఆధ్వర్యంలో గ్రామస్థులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ తూర్పాటి లక్ష్మీ దుర్గ – రాజు గారు, 23వ వార్డు కౌన్సిలర్, బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు.

