అంగన్వాడి టీచర్లకు, ఆశ కార్యకర్తలకు సన్మానం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా 23 వ వార్డులో అంగన్వాడి కేంద్రంలో పనిచేసే అంగన్వాడీ టీచర్లను ఆశా కార్యకర్తలను శనివారం బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో పిల్లలకు అందుతున్న సేవల తీరును పరిశీలించి, చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. అంగన్వాడి సిబ్బంది పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలను ఆయన అభినందించారు. సమాజంలో బలహీన వర్గాలు, చిన్నారుల సంక్షేమం కోసం అంగన్వాడి కేంద్రాలు వేదికగా మారుతున్న తీరు అభినంద నీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ కన్వీనర్, పదవ వార్డు కౌన్సిలర్ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు కొలుగురి సుమలత, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, నరాల రాజశేఖర్, అంకటి వాసు, బొడిగ రాద, రాజేష్ ఖన్నా, వీరయ్య, రామచంద్రం, విజయ్, కృష్ణ, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

