Social 1080×1350 • Multi-page
03-10-2026 BREAKING NEWS 11:27 PM
swarnodayam.com
Telugu Daily News

కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలి. – బీసీ జేఏసీ

కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలి. – బీసీ జేఏసీ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో విపరీతంగా ఉన్న కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని కి శనివారం బీసీ జేఏసీ నాయకులు వినతి పత్రము అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పట్టణ ప్రజలు కోతుల బెడద మూలంగా అనేక ఇబ్బందులకు గురి కావడమే కాకుండా ప్రాణ భయంతో తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని, ప్రతిరోజు పట్టణంలో ఏదో ఒక చోట కోతుల వల్ల గాయపడ్డ వారు ఉన్నారని అన్నారు. వెంటనే మున్సిపాలిటీ స్పందించి ప్రజలను కోతుల బాధ నుండి కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న, మహిళా కార్యదర్శి దేవసాని ప్రియదర్శిని ఇప్పకాయల సాగర్, మామునూరు ప్రవీణ్ కుమార్, కొలిపాక క్రాంతి కుమార్, రామ్ సారయ్య, దాట్ల ప్రభాకర్, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


## లోకల్ యాడ్స్ ##

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!