తెలంగాణ ఉద్యమకారుల రిలే నిరాహార దీక్షలు 18వ రోజుకు చేరిక : కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 18వ రోజుకు చేరుకున్నాయి.
ఈనాటి దీక్షా కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గ జేఏసీ చైర్మన్ అవునూరి సమయ్య ముఖ్యఅతిథిగా హాజరై ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉద్యమకారులు గంగాధర్, భాస్కర్ గౌడ్, సంజీవరెడ్డి, సత్యనారాయణ, బసవరాజు, బి. పరమేశ్వర్ దీక్షలో కూర్చున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు పోరాటం ఆపేది లేదని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పటోళ్ల సురేందర్ రెడ్డి, పుట్నాల కృష్ణ, అనంతుల సంతోష్, డోలి సుధీర్, భాస్కర్, నర్సింహా నగేష్ తదితరులు పాల్గొని దీక్షా శిబిర సందర్శన చేసి ఉద్యమకారులకు తమ పూర్తినైతిక సంఘీభావాన్ని ప్రకటించారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ కొలుగూరి సుమలత – సుమన్ గారు, 10వ వార్డు కౌన్సిలర్, (ఇప్పల్ నర్సింగాపూర్), బిజెపి మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు – బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.

