హుజూరాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – తొమ్మిది మంది కూలీలకు గాయాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని పెద్దపాపయ్యపల్లి వద్ద జాతీయ రహదారి 563 (కరీంనగర్ – వరంగల్) పై భానువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఓమిని వ్యాన్ వెనుక టైరు ఒక్కసారిగా పగలడంతో వాహనం అదుపుతప్పి సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లింది.
ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా కొత్తూరు జెండా ప్రాంతానికి చెందిన కూలీలు పనుల నిమిత్తం ఓమిని వ్యాన్‌లో కరీంనగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టైరు పేలిపోవడంతో వ్యాన్ వేగంగా పొలాల్లోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఆసుపత్రికి తరలింపు: సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం (MGM) ఆసుపత్రికి రిఫర్ చేశారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న హుజూరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
&&లోకల్ యాడ్స్&&
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ కొలుగూరి సుమలత – సుమన్ గారు, 10వ వార్డు కౌన్సిలర్, (ఇప్పల్ నర్సింగాపూర్) బిజెపి మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు – బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.

