Social 1080×1350 • Multi-page
05-10-2026 BREAKING NEWS 07:37 PM
swarnodayam.com
Telugu Daily News

పర్యావరణ పరిరక్షణ చేపట్టాలి. – వాకర్స్ అసోసియేషన్ సభ్యులు

పర్యావరణ పరిరక్షణ చేపట్టాలి.  – వాకర్స్ అసోసియేషన్ సభ్యులు
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా ఉన్న ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. సోమవారం వారు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో టి సునీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ప్లాస్టిక్ కవర్ల వినియోగం పెరగడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలగడంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉద్యమం కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లను బహిరంగ ప్రదేశాల్లో పడేయడం వల్ల కాలువలు, చెరువులు కలుషితమవుతున్నాయని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని అన్నారు. ప్లాస్టిక్‌కు బదులుగా గుడ్డ, జూట్ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు.
అధికారులు గ్రామాలు, పట్టణాల్లో ప్లాస్టిక్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నిషేధిత ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాజపల్లి సర్పంచ్ కట్కూరి మల్లారెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కానుగంటి శ్రీనివాసు, మామిడిపల్లి సాయి, సారయ్య, వేల్పుల రత్నం, బత్తుల సమ్మయ్య, మట్టెడ ప్రకాష్, రాజమౌళి, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!