Social 1080×1350 • Multi-page
05-10-2026 BREAKING NEWS 08:48 PM
swarnodayam.com
Telugu Daily News

పోరాడే యూనియన్ కు మద్దతు పలకండి. – డిపో వద్ద గేట్ మీటింగ్ లో టీఎంయూ రాష్ట్ర నాయకులు ఎంపీ రెడ్డి

పోరాడే యూనియన్ కు మద్దతు పలకండి. – డిపో వద్ద గేట్ మీటింగ్ లో టీఎంయూ రాష్ట్ర నాయకులు ఎంపీ రెడ్డి
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడే టీఎంయూను కార్మికులు గుర్తింపు సంఘ ఎన్నికల్లో మద్దతు ప్రకటించాలని టీఎంయూ రాష్ట్ర నాయకులు ఎంపీ రెడ్డి కోరారు. సోమవారం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద గేట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్టీసీ గుర్తింపు సంఘం కోసం జరిగే ఎన్నికలు కార్మికుల ప్రయోజనాలు కాపాడే ఎన్నికలని అన్నారు. నిరంతరం కార్మికుల ప్రయోజనాల కోసం టీఎంయూ అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీఎంయూ రాష్ట్ర నాయకులు శంకర్ రెడ్డి, రీజనల్ నాయకులు ఏవిఆర్ రెడ్డి, డిపో కార్యదర్శి టిఎస్ సింగ్, సాదుల కిషోర్, మహిళా అధ్యక్షురాలు పీవీ లక్ష్మి, నాయకులు కుడికాల అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!