Social 1080×1350 • Multi-page
06-10-2026 BREAKING NEWS 10:57 AM
swarnodayam.com
Telugu Daily News

ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే : వొడితల ప్రణవ్

ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమే : వొడితల ప్రణవ్
IMG-20261006-WA0010

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని నాయకులు వొడితల ప్రణవ్ తెలిపారు.

​ఈ నెల 9న జరగనున్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారంలో భాగంగా, హుజూరాబాద్‌లోని ఐక్య కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ…గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, వారిని అనేక ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు.

​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల న్యాయమైన డిమాండ్లను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీన అంశం ఇప్పటికే ప్రభుత్వం దృష్టిలో ఉందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని పనులను తమ ప్రభుత్వం చేసి చూపిస్తుందని, కార్మికులకు, ప్రభుత్వానికి మధ్య మంత్రి పొన్నం ప్రభాకర్ వారధిగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో కార్మికులంతా ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించి, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసిని, కౌన్సిలర్లు, ఐక్య కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.


##లోకల్ యాడ్స్##

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ కొండ ప్రశాంతి – మంచికట్ల మురళి గారు, 25వ వార్డు కౌన్సిలర్ – బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!