Social 1080×1350 • Multi-page
06-10-2026 BREAKING NEWS 02:56 PM
swarnodayam.com
Telugu Daily News

అంగన్వాడీ కార్యకర్తలకు ఘనంగా సన్మానం : బీజేపీ సేవా సంకల్ప అభియాన్

అంగన్వాడీ కార్యకర్తలకు ఘనంగా సన్మానం : బీజేపీ సేవా సంకల్ప అభియాన్
IMG-20261006-WA0046

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్(ప్రతాపవాడ ): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా, బీజేపీ 4వ వార్డు ఇన్చార్జి అంకతి శ్రీనివాస్ (వాసు) ఆధ్వర్యంలో మంగళవారం అంగన్వాడీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

​స్థానిక 4వ వార్డు ప్రతాపవాడలోని బూత్ నెంబర్ 29 అంగన్వాడీ సెంటర్ వద్ద “అంగన్వాడీ మిలన్” సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సమాజానికి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలను కొనియాడుతూ అంగన్వాడీ టీచర్ సుంకరి జయ, ఆయమ్మ అరుణ, ఆశా వర్కర్ శశికళలను నాయకులు ఘనంగా సన్మానించారు.

​ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు, 10వ వార్డు కౌన్సిలర్ కొలుగురి సుమలత, అంకతి రతమ్మ, బూత్ ప్రెసిడెంట్ బెజ్జంకి రాజేందర్, యాట రాజేష్ ఖన్నా, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, ఇల్లందుల ప్రణీత్, పడాల కొమురయ్య, కుసుమ సమ్మయ్య, పిట్టల విజయ్, పడారి సుమన్ మరియు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ కొండ ప్రశాంతి – మంచికట్ల మురళి గారు, 25వ వార్డు కౌన్సిలర్ – బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!