Social 1080×1350 • Multi-page
06-10-2026 BREAKING NEWS 07:26 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌లో ఘనంగా ‘అంగన్ మిలన్ సేవ’ : – చిన్నారులకు పండ్ల పంపిణీ, సిబ్బందికి సన్మానం

హుజురాబాద్‌లో ఘనంగా ‘అంగన్ మిలన్ సేవ’ : – చిన్నారులకు పండ్ల పంపిణీ, సిబ్బందికి సన్మానం
IMG-20261006-WA0078

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబర్: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ పట్టణంలో బిజెపి నాయకులు, కౌన్సిలర్లు ‘అంగన్ మిలన్ సేవ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

​పట్టణంలోని 4, 7, 8, 9, 16, 17, 18, 20, 22, 30 తదితర వార్డులలోని అంగన్వాడీ కేంద్రాలను నాయకులు సందర్శించి, చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

​చిన్నారుల పోషణ, మహిళల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: తూర్పాటి రాజు

​ఈ సందర్భంగా బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు మాట్లాడుతూ— చిన్నారుల ఆరోగ్యం, సరైన పోషణ అందించడంలో అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. దేశంలో చిన్నారుల సంక్షేమం, మహిళా సాధికారత లష్యంగా మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

​కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు:

​ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజుతో పాటు కార్యక్రమ కన్వీనర్, 10వ వార్డు కౌన్సిలర్ కోలుగురి సుమలత, కౌన్సిలర్ దామెర అనూష అనురాగ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, సెంట్రల్ ఫిలిం బోర్డ్ మెంబర్ సబ్బని రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి తిప్పబత్తిని రాజు, మాజీ కౌన్సిలర్ పైళ్ళ వెంకట్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు ఇల్లందుల ప్రణీత్ పాల్గొన్నారు.

​అలాగే నాయకులు సబ్బని మాధవి, బోడిగే రాధ, ఎర్ర శ్రీధర్, అంకటి వాసు, యాట రాజేష్, మోలుగురి రాజు, నరాల రాజశేఖర్, పడారి సుమన్, పడారి కొమురయ్య, పట్టణ కార్యదర్శి కొడిమ్యాల పవన్ కుమార్, ఈదులకంటి శ్రీనివాస్ రెడ్డి, కొలుగూరి అనిల్ కుమార్, అంకటి రత్తమ్మ, క్యాష వెంకటేష్, మోడపు వినయ్, నరెడ్ల చైతన్య రెడ్డి, పిట్ట విజయ్, కుసుమ సమ్మయ్య, బెజ్జంకి రాజేందర్, బండి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ కొండ ప్రశాంతి – మంచికట్ల మురళి గారు, 25వ వార్డు కౌన్సిలర్ – బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!