ప్రజల మద్దతు లేకనే బీజేపీ ‘ఓటు చోరీ’కి పాల్పడుతోంది: వొడితల ప్రణవ్

—ఇండియా కూటమి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో భారీ నిరసన ర్యాలీ
—కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన సీనియర్ నాయకులు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు అనేది ప్రాథమిక హక్కు అని, అలాంటి హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఇండియా కూటమి నాయకుడు వొడితల ప్రణవ్ ఆరోపించారు. ‘ఓటు చోరీ’ అంశంపై ఏఐసీసీ పిలుపు మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ నగరంలోని ఇందిరా చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ… ప్రజల్లో మద్దతు కోల్పోయిన బీజేపీ, అధికార దాహంతోనే ఓట్ల చోరీకి ఒడిగడుతోందని మండిపడ్డారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ, బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు. వెంటనే సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.


ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసినితోపాటు సీపీఐ, సీపీఎం తదితర వామపక్ష కూటమి నాయకులు, ప్రజాసంఘాలు, మహిళా నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ కొండ ప్రశాంతి – మంచికట్ల మురళి గారు, 25వ వార్డు కౌన్సిలర్ – బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.

