ప్రణవ్ చొరవతో మచ్చర్ల మొగిలికి ₹1.75 లక్షల ఎల్‌ఓసీ అందజేత

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (ఇల్లందకుంట) హుజూరాబాద్ : కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన మచ్చర్ల మొగిలి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, వైద్య ఖర్చులు భరించే పరిస్థితి లేక కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన వొడితల ప్రణవ్ వెంటనే స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితుడికి ₹1,75,000 విలువైన ఎల్‌ఓసీ (Letter of Credit) మంజూరు చేయించి అందించారు.

కష్టకాలంలో తమకు అండగా నిలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు మరియు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్‌కు బాధితుని కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ కొండ ప్రశాంతి – మంచికట్ల మురళి గారు, 25వ వార్డు కౌన్సిలర్ – బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.

