Social 1080×1350 • Multi-page
06-10-2026 BREAKING NEWS 11:40 PM
swarnodayam.com
Telugu Daily News

కొత్తగట్టు వద్ద ర్యాంపు నిర్మాణం చేపట్టాలి. – గ్రామస్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.. – అధికారులకు కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం

కొత్తగట్టు వద్ద ర్యాంపు నిర్మాణం చేపట్టాలి. – గ్రామస్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి.. – అధికారులకు కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం
IMG-20261006-WA0085

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కొత్తగట్టు స్టేజి వద్ద జాతీయ రహదారి నిర్మాణంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. గ్రామస్తులు రహదారిని సురక్షితంగా దాటేందుకు వీలుగా క్రాసింగ్‌ వద్ద ర్యాంపు నిర్మాణం చేపట్టాలని సూచించారు.

కొత్తగట్టు వద్ద జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా తమ గ్రామానికి వెళ్లేందుకు సరైన ర్యాంపు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. అండర్‌పాస్‌ల నుంచి గ్రామస్తులు సాఫీగా రాకపోకలు సాగించేలా ఒక వైపు ఇప్పటికే నిర్మించిన ర్యాంపుతో పాటు మరో వైపు కూడా ర్యాంపు నిర్మించాలని కోరారు.

నేషనల్ హైవే పై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్ చిత్రా మిశ్రా

గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన కలెక్టర్ చిత్రా మిశ్రా మంగళవారం రాత్రి తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, జాతీయ రహదారి-563 ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్ తదితర అధికారులతో కొత్తగట్టు వద్ద నెలకొన్న పరిస్థితిపై చర్చించారు.
కొత్తగట్టు వద్ద ర్యాంపు లేకపోవడంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారు చేసిన విజ్ఞప్తి, సమస్యకు పరిష్కార మార్గాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రాసింగ్‌ వద్ద ర్యాంపు నిర్మాణానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ కొండ ప్రశాంతి – మంచికట్ల మురళి గారు, 25వ వార్డు కౌన్సిలర్ – బిజెపి సీనియర్ నాయకులు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!