ఎస్ ఐ ఆర్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించండి. – ఆర్డీవో జల కుమారి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ఎన్నికల సంఘం ఏర్పాటుచేసన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐఆర్) ప్రక్రియ పూర్తి కావడానికి రాజకీయ పార్టీల నాయకులు మరింత సహకారం అందించాలని హుజురాబాద్ ఆర్డీవో నాయక్ వాడి జల కుమారి అన్నారు. బుధవారం హుజూరాబాద్ శివారులోని కేసి క్యాంప్లో గల ఆర్డీవో కార్యాలయంలో ఆమె రాజకీయ పార్టీల నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా వివిధ రకాల తప్పులు ఉన్న ఓటర్లకు నోటీసులు అందించడం జరిగిందని ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు చాలామంది జవాబులు ఇచ్చారని కానీ ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉందన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన బిఎల్వోలు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు ఓటర్లు సమాధానం ఇచ్చేలా కృషి చేయాలని తద్వారా 100 శాతం పూర్తవుతుందని అన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ కిషన్, తహసిల్దార్లు జక్కని నరేందర్ రమేష్ సురేష్, సీనియర్ అసిస్టెంట్ బాలకిషన్, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
@లోకల్ యాడ్స్@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీ సిరిపాటి వేణు గారు, బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హుజురాబాద్ కరీంనగర్ జిల్లా.

