Social 1080×1350 • Multi-page
07-10-2026 BREAKING NEWS 11:26 PM
swarnodayam.com
Telugu Daily News

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం. -కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీల అరెస్టు అప్రజాస్వామికం. -కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు
IMG-20261007-WA0126

—సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి..

—కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, అక్టోబర్ 7: ఓటరు జాబితాల సవరణ పేరుతో దేశంలో ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసే పరిస్థితులు నెలకొంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. ఓటర్ల హక్కులపై ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసి వేణుగోపాల్ తో పాటు ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆయన తీవ్రంగా ఖండించారు.

బుధవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ‘‘ఓటు అనేది కేవలం ఒక గుర్తు కాదు.. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. ఆ ఓటు హక్కుకు సంబంధించిన అనుమానాలు, సందేహాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ప్రశ్నించిన నాయకులను అరెస్టు చేయడం సమస్యకు పరిష్కారం కాదు’’ అని రాజేందర్ రావు అన్నారు.

ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉండాల్సిన అవసరం ఉందని, ఎన్నికల సంఘం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలని ఆయన అన్నారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమగ్రంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘దేశ ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం ఒక కాపలాదారు. కానీ అదే వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు తలెత్తే పరిస్థితి రావడం ఆందోళనకరం. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆయన ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్ సిఈసి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాటం చేయడం లేదని రాజేందర్ రావు అన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని, ఆ హక్కును అణచివేసేందుకు అరెస్టులు, నిర్బంధాలను ఉపయోగించడం సరైన విధానం కాదని రాజేందర్ రావు అన్నారు. ‘‘రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేయడం ద్వారా వారి గొంతును అణచివేయలేరు. దేశ ప్రజల గొంతుకను కూడా అణచివేయ లేరని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును ఎవరూ కాలరాయలేరు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని రాజేందర్ రావు డిమాండ్ చేశారు. ఓటరు జాబితాల సవరణ నుంచి ఎన్నికల ఫలితాల వరకు ప్రతి దశలోనూ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ‘‘దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఓటు హక్కు బలంగా ఉండాలి. ఓటు హక్కు బలంగా ఉండాలంటే ఓటరు జాబితాలు పారదర్శకంగా ఉండాలి. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఈ మూడు అంశాల్లో ఎక్కడైనా అనుమానం తలెత్తితే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది. అందుకే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాడుతుంది’’ అని వెలిచాల రాజేందర్ రావు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల తరఫున నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శ్రీ సిరిపాటి వేణు గారు, బేడ బుడగ జంగం, జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హుజురాబాద్ కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!