Social 1080×1350 • Multi-page
08-10-2026 BREAKING NEWS 08:32 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. – అన్ని వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పిచాలి. – ప్రవీణ్ ఆరోరా చేపట్టిన ఆర్ధిక ఆధారిత రిజర్వేన్ల ఉద్యమానికి రాష్ట్ర ఓసీ, రెడ్డి సంఘాల జేఏసీ, రాష్ట్ర ఎంఆర్.పీఎస్ సంపూర్ణ మద్దతు.

ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. – అన్ని వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పిచాలి. – ప్రవీణ్ ఆరోరా చేపట్టిన ఆర్ధిక ఆధారిత రిజర్వేన్ల ఉద్యమానికి రాష్ట్ర ఓసీ, రెడ్డి సంఘాల జేఏసీ, రాష్ట్ర ఎంఆర్.పీఎస్ సంపూర్ణ మద్దతు.
IMG_20261008_201935

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: అన్ని వర్గాల పేదలకు కుల మత ప్రాతిపదికన అమలవుతున్న ప్రస్తుత రిజర్వేషన్ల స్థానంలో అన్ని సామాజిక వర్గాల్లోని పేదలకు సమన్యాయం కోసం ఆర్ధిక స్థితి గతుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించాలని పలువురు రాష్ట్ర ఓసీ, రెడ్డి జేఏసీ, ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల రాష్ట్ర సమన్వయ కమిటీ, ఎంఆర్.పీఎస్ సంఘాల రాష్ట్ర, జిల్లాల నాయకులు కోరారు.
గురువారం హైదరాబాద్ లో రాష్ట్ర రెడ్డి జేఏసీ అధ్యక్షుడు అప్పమ్మ గారి రాంరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర, వివిధ జిల్లాల ఓసి ఐకాస నాయకుల తో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఏ సామాజిక వర్గానికి, మతానికి తాము వ్యతిరేకం కాదని కుల మతాలకతీతంగా అన్ని వర్గాల్లోని పేదలందరికి సమన్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమన్నారు.
ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలోని రాజ్ ఘాట్ నుంచి సామాజిక ఉద్యమ కారుడు ప్రవీణ్ ఆరోరా ఆధ్వర్యంలో చేపట్టిన దేశ వ్యాప్త బస్సు యాత్రకు రాష్ట్ర ఓసీ, రెడ్డి, వైశ్య, ఎం. ఆర్.పీ.ఎస్ సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సమావేశంలో పాల్గొన్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి,రెడ్డి ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోశ్ రెడ్డి, రెడ్డి జాగ్రతి అధ్యక్షులు బుట్టంగారి మాధవరెడ్డి, ఓసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి,ఆర్య వైశ్య సంఘాల అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, ఎం. ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి, ఓసీ జేఏసీ రాష్ట్రఉపాధ్యక్షులు చందుపట్ల నర్సింహారెడ్డిలు తెలిపారు.

ఆర్ధిక ఆధారిత ఉద్యమానికి మద్దతుగా యాత్రలో తెలుగు రాష్ట్రాల్లోని ఓసీ ఐకాస ఇతర సామాజిక వర్గీయల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ యాత్ర తెలంగాణ లో ఈనెల 24 నుంచి ఆదిలాబాద్ లో ప్రవేశించి నిర్మల్ ద్వారావేలాది మందితో ఆర్మూర్ నిజామాబాదు, కామారెడ్డి, రామాయంపేట, తూప్రాన్, మేడ్చల్ ,కొంపెల్లి, హైదరాబాద్ ద్వారా జనగాం,హన్మకొండ, నుండి పరకాల వరకు 3 రోజుల పాటు సాగుతుందని తెలిపారు.
ప్రస్తుత రిజర్వేషన్ల అమలులో క్రిమిలేయర్ విధానం లేకపోవడం వల్ల రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇప్పటికే పొందిన కుటుంబాలకే అవి పునరావృతమవుతున్న నేపథ్యంలో అర్హులైన ఇతర పేదలకు అన్యాయం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు.
తమకు రిజర్వేషన్ల లో అన్యాయం జరుగుతుందని మరింతగా విస్తరించాలనే డిమాండ్లతో కొన్ని వర్గాలు పోరాటం చేస్తున్న సందర్బంగా 50 శాతంకు పైగా రిజర్వేషన్లు కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయాన్నారు. దీని వల్ల ప్రతిభావంతులకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఓసీ ల్లోని ఆర్ధికంగా వెనుక బడిన వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేంద్రం కల్పించిన తరహాలో అన్ని వర్గాల్లోని పేదలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఆర్ధిక స్థితి గతుల ఆధారంగా రిజర్వేషన్ల విధానాన్ని రూపొం దించాలని కోరారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చట్ట బద్ద కమిషన్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల ఆర్థిక స్థితి గతుల పై సమగ్ర అధ్యయనం చేయాలని వారు సూచించారు.
అవసరమైతే రాజ్యాంగ సవరణ కై పార్లమెంట్ లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తో పాటు నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం ఐకాస రాష్ట్ర నాయకులు పైళ్ల హరినాథ్ రెడ్డి, పల్లె జైపాల్ రెడ్డి, గొట్టెముక్కుల ప్రభాకర రెడ్డి,దయాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి,చిటుకుల నర్సింహారెడ్డి,బోయినపల్లి పాపారావు, రమేష్, శర్మ తదితర రాష్ట్ర, వివిధ జిల్లా నాయకులు సమావేషంలో పాల్గొన్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గూడూరి అంజలి – గౌతమ్ రెడ్డిగారు, వైస్ చైర్పర్సన్ (8వ వార్డు కౌన్సిలర్) పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. హుజురాబాద్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!