Social 1080×1350 • Multi-page
08-10-2026 BREAKING NEWS 11:13 PM
swarnodayam.com
Telugu Daily News

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం
IMG-20261008-WA0166

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ హుజురాబాద్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి హుజురాబాద్ పట్టణంలో గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని మాట్లాడుతూ…ఉపాధ్యాయులు రేపటి పౌరులను తయారు చేసే కర్మ గారాలని, అలాంటి వ్యక్తులకు సమాజంలో ఉన్నత స్థానం ఉందన్నారు. వారి వల్లనే మన దేశానికి మేధావులను తయారవుతారని అన్నారు. ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ…ఉపాధ్యాయులను గౌరవించడం మనను మనం గౌరవించుకోవడం లాంటిదన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే 25 మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు గౌరిశెట్టి సోమేశ్వర్, కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి శబ్దప్రకాష్, డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, ఏం నారాయణరెడ్డి, సమ్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


@@లోకల్ యాడ్స్@@

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గూడూరి అంజలి – గౌతమ్ రెడ్డిగారు, వైస్ చైర్పర్సన్ (8వ వార్డు కౌన్సిలర్) పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!