Social 1080×1350 • Multi-page
09-10-2026 BREAKING NEWS 05:56 AM
swarnodayam.com
Telugu Daily News

క్రేటా కారు బోల్తా : తప్పిన భారీ ప్రమాదం!

క్రేటా కారు బోల్తా : తప్పిన భారీ ప్రమాదం!
IMG-20261009-WA0000

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డులో శుక్రవారం భారీ కారు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంతో వెళ్తున్న ఒక క్రేటా కారు తీవ్ర ప్రమాదానికి గురై బోల్తా పడింది.

​ప్రమాదం జరిగిన తీరు:

జమ్మికుంట నుంచి వరంగల్ వైపు వేగంగా వెళ్తున్న క్రేటా కారు, ఇండియన్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. ప్రమాద తీవ్రతకు కారు మొదట రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని, ఆ తర్వాత ఒక చెట్టును, అనంతరం పక్కనే ఉన్న ఒక హోటల్(పోచయ్య హోటల్) భవనాన్ని వరుసగా బలంగా ఢీకొట్టి చివరికి బోల్తా పడింది.

​ప్రయాణికులు సురక్షితం:

ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో టిఎస్ 08 జెబి 6898 నంబర్ గల కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ అందరూ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడటంతో స్థానికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

​రంగంలోకి పోలీసులు:

సమాచారం అందుకున్న వెంటనే హుజురాబాద్ ఏఎస్ఐ కమలాబాయి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నారు.


&&లోకల్ యాడ్స్&&

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీమతి శ్రీ గూడూరి అంజలి – గౌతమ్ రెడ్డిగారు, వైస్ చైర్పర్సన్ (8వ వార్డు కౌన్సిలర్) పురపాలక సంఘం హుజురాబాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!