Telugu Daily News
హుజూరాబాద్ లోని వి.ఎస్.ఆర్. డిగ్రీ కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలం సింగపురంలోని వి.ఎస్.ఆర్. డిగ్రీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా విద్యార్థినులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, ఆడుపాడి ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణం పండుగ శోభతో, పూల సౌరభాలతో కళకళలాడింది. బతుకమ్మ వేడుకల సాంప్రదాయాలను, ప్రాధాన్యతను విద్యార్థులకు అధ్యాపకులు వివరించారు.



ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తాళ్లపల్లి అజయ్ కుమార్, కల్చరల్ ఆర్గనైజర్ ఎన్. రమాదేవి, అధ్యాపక బృందం కోమల, రచన, తిరుపతి, సదయ్యలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

