Social 1080×1350 • Multi-page
09-10-2026 BREAKING NEWS 11:05 PM
swarnodayam.com
Telugu Daily News

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకుప్రత్యేక చట్టం తేవాలి..! -ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకుప్రత్యేక చట్టం తేవాలి..! -ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు.
IMG-20261009-WA0226

—అన్ని వర్గాల పేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి.!!!

—ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల అమలు ఉద్యమానికి
ఓసీ జేఏసీ, బహుజన కుల సంఘాల సంపూర్ణ మద్దతు…

—అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనానికి చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి.

—ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(పరకాల): కుల మతాలకతీతంగా ఆర్ధిక ప్రాతిపదిక అన్ని వర్గాల పేదలకు విద్యా, ఉద్యోగ,ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించడమే ద్యేయంగా ఉద్యమం చేపడుతున్నామని, ఓసీ ఐకాస, ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన ఉద్యమ కమిటీ నాయకులు తెలిపారు.
కుల, మత ప్రాతిపదికన అమలవుతున్న ప్రస్తుత రిజర్వేషన్ విధానానికి ప్రత్యామ్నాయంగా అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించి సమన్యాయం జరపాలని ఇందు కు కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి,ఆర్ధిక ఆధారిత రిజర్వేషన్ల సాధన రాష్ట్ర కో. ఆర్డినేటర్ అప్పమ్మ గారి రాంరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా పరకాలలో రాజ రాజేశ్వర కళ్యాణ మండపంలో ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా ఓసీ ఐకాస ప్రతినిధులు, కుల సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏ సామాజిక వర్గానికీ, మతానికీ తాము వ్యతిరేకం కాదని, కుల–మతాలకు అతీతంగా అన్ని వర్గాల్లోని పేదలకు సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం సామాజిక ఉద్యమకారుడు ప్రవీణ్ ఆరోరా ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్‌ఘాట్ నుంచి చేపట్టిన దేశవ్యాప్త రథ యాత్ర కు ఓసీ జేఏసీ, బహుజన కుల సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ లో ఈనెల 24 న ఆదిలాబాద్ లో ప్రవేశించి 26 న జనగామ, హన్మకొండ మీదుగా పరకాల కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుందని ఈ సందర్బంగా పరకాల లో ఓసీ జేఏసీ, బహుజన కుల సంఘాల ఆధ్వర్యంలో 26 న సాయంత్రం 5గంటలకు పార్టీల కతీతంగా వేలాది మంది తో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు
వెల్లడించారు.
ప్రస్తుత రిజర్వేషన్ విధానంలో క్రిమిలేయర్ నిబంధనల అమలు లేకపోవడం తో రిజర్వేషన్ల ప్రయోజనాలు ఇప్పటికే పొందిన కుటుంబాలకే ప్రయోజనాలు పునరావృతమవుతున్నాయనే వాదనల నేపథ్యంలో, అర్హులైన ఇతర పేదలకు న్యాయం జరగాలన్నారు.
ఈ నేపథ్యంలో
ఓసీ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన తరహాలోనే, అన్ని సామాజిక వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారికి సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆర్థిక స్థితిగతుల ఆధారిత రిజర్వేషన్ విధానాన్ని రూపొందించాలని వారు కోరారు.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని సామాజిక వర్గాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. అవసరమైతే రాజ్యాంగ సవరణపై పార్లమెంట్‌లో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని పోలాడి రామారావు, అప్పమ్మ రాంరెడ్డిల తో పాటు అధ్యత వహించిన గోపు జైపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం సమావేశ గోడ ప్రతులను నాయకులు ఆవిష్కరించారు.

ఇదే సమావేశంలో ఇటీవల దేవాలయ కమిటి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన హన్మకొండ జిల్లా ఓసీ జేఏసీ అధ్యక్షులు కొలగూరి రాజేశ్వర్ రావుకు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఓసీ ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చందుపట్ల నర్సింహారెడ్డి, ప్రచార కార్యదర్శి కామిడి సతీష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పైళ్ల హరినాథ్ రెడ్డి,హన్మకొండ జిల్లా అధ్యక్షులు కోలాగూరి రాజేశ్వర్ రావు,రెడ్డి జేఏసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఐలినేని మల్లికార్జున రెడ్డి,బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసాల సంపత్,జమ్మికుంట మార్కెట్ కమిటీమాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాజేశ్వరావు, రాష్ట్ర నాయకుడు బొక్క శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ బార్ అసోసియేషన్ జేఏసీ నాయకులు జలంధర్ రెడ్డి, కరీంనగర్ బార్ అసోసియేషన్ జేఏసీ అధ్యక్షులు పి,వీ రాజకుమార్, నాయీబ్రాహ్మణ సంఘాల ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు జంపాల నర్సయ్య, భిక్షపతి, పద్మశాలి సంఘాల రాష్ట్ర నాయకులు బచ్చు ఆనందం, నాయకులు కామిడి రత్నాకర్ రెడ్డి, నడిపెల్లి లింగారావు, నాయినేని రవీందర్ రావు, దూదిపాల తిరుపతిరెడ్డి,రూప్ రెడ్డి తిరుపతిరెడ్డి ,వెంకట శ్రవణ్, కుమారాచార్య, అయిత సతీష్ తదితర రాష్ట్ర, ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!