Social 1080×1350 • Multi-page
24-05-2024 BREAKING NEWS 05:30 AM
swarnodayam.com
Telugu Daily News

నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలి..

నాణ్యమైన విత్తనాలనే కొనుగోలు చేయాలి..
IMG-20240524-WA0133

-నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

-హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

నాణ్యమైన విత్తనాలను గుర్తింపు పొందిన దుకాణాల ద్వారా కొనుగోలు చేయాలని అలాగే నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసుల తరపున ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి రైతులకు విజ్ఞప్తి చేశారు. హుజురబాద్ సబ్ డివిజన్ పోలీసుల తరఫున రూపొందించిన జై కిసాన్ పేరుతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన వాల్ పోస్టర్లను సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో కలిసి శుక్రవారం ఆయన ఎసిపి కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీబీ శ్రీనివాస్ జి మాట్లాడుతూ వర్షాకాలంలో పంటలు వేసుకోవడానికి అందరూ దుక్కి దున్ని విత్తనాల కొరకు ఎదురుచూస్తూ ఉంటున్నారనీ, ప్రస్తుత పరిస్థితుల్లో నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండటం వల్ల రైతు సోదరులందరూ కూడా మోసపోకుండా మంచి విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. మంచి పంటను మీరు పొందాలని హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామాన్నారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి విత్తనాలతో పాటు నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉన్నందున రైతులు మోసపోకుండా నాణ్యమైన పత్తి విత్తనాలను, వరి విత్తనాలను ఎంచుకొని మీ పంట పొలాల్లో నాటుకోవాలన్నారు. హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసులు రైతుల సంక్షేమం కొరకు పలు సూచనలు తెలియజేయడం జరుగుతుందన్నారు. మీరు మార్కెట్లో విత్తనాలను ఖరీదు చేసేటప్పుడు కచ్చితంగా బిల్లు తీసుకోవాలని, ఎక్కడైనా తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి నకిలీ విత్తనాలను తీసుకుంటే ఆ తర్వాత భారీగా నష్టపోతారని తెలిపారు. అలాంటి నష్టం మీకు వాటిల్లకుండా ఉండాలంటే నాణ్యమైన విత్తనాలను ఎంచుకొని తీసుకోవాలన్నారు. ఎవరైనా ఎక్కడైనా నకిలీ విత్తనాలు మీకు ఇవ్వాలని చూసిన మీ దృష్టికి వచ్చిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ సంబంధిత పోలీసు అధికారులకు కానీ లేదా వ్యవసాయ అధికారులకు కానీ సమాచారం అందించాలని కోరారు.

రైతుల కోసం పోలీసులు తయారు చేసిన పలు సూచనలు పాటించి నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి మంచి రాబడులను పొందాలని కోరుకుంటున్నట్లు ఏసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట టౌన్, రూరల్ సిఐలు బొల్లం రమేష్, కె రవి, వెంకటేశ్వర్లు, సబ్ డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!