Social 1080×1350 • Multi-page
09-10-2026 BREAKING NEWS 11:20 PM
swarnodayam.com
Telugu Daily News

భూ వివాదం పరిష్కారం కాక ఓ రైతు ఆత్మహత్యాయత్నం..

భూ వివాదం పరిష్కారం కాక ఓ రైతు ఆత్మహత్యాయత్నం..
IMG-20261009-WA0229

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : భూమి వివాదం పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెందిన
హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామానికి చెందిన కేశవేణి పర్వతాలు అనే రైతు శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం…

పర్వతాలుకు నలుగురు సోదరులు వారు కుటుంబ ఆస్తిని గత 30 సంవత్సరాల క్రితం పంచుకున్నప్పటికీ ఇటీవల పర్వతాలు సోదరుడు కొమురయ్యతో భూమి వివాదం నెలకొంది. పర్వతాలు తన కుమార్తెల పెళ్లిళ్ల కోసం అప్పులు చేయగా వాటిని తీర్చడం కోసం భూమిని విక్రయించడానికి ప్రయత్నిస్తే సోదరుడు కొమురయ్య ఇబ్బంది పెడుతుండడంతో పోలీసులను ఆశ్రయించారు. గ్రామంలోని పెద్ద మనుషుల వద్ద వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కొమురయ్య వినక ఇబ్బందులు పెడుతుండడంతో మనస్థాపానికి చెందిన పర్వతాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని 108లో హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పర్వతాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!